Monday, October 28, 2013

ప్రియనేస్తమా.... I MISS YOU

 
నీవు నన్ను చేరిన వేళ మది సంద్రంలో ఉవ్వేతున ఎగసే మధుర భావాల తరంగ సంచలనం
ఎందుకని?
అవి నీ చూపుల సూర్యునికి, వెన్నెల ధరహసానికి ఆకర్షవికర్షణలకు లోనై నిన్ను అందుకోవలనేమో, నీలో కలిసిపోవాలనేమో.
నీవు నన్ను విడిచి వెళ్తున్న క్షణం అదే మదిసంద్రంలో నిశీధి నిశబ్దకన్నీటి తరంగం
ఎందుకని?
బహుశా అవి నీ కంటి నులువెచ్చని చూపుల సూర్యకిరణాల స్థానాన్ని శిశిరకాంత కన్నీటి మంచి బిందువులు చేర్చిన్దనేమో?
నీ విశాల వదనాకశాన వెన్నెల ధరహాసాల స్థానాన్ని నిశీధి నిశి కమ్ముకున్దనేమో.
ఎందుకు ప్రియనేస్తం?
ఇంత నిరాసక్త నిర్లిప్త కావ్యస్థితి.
చెప్పలేదు కానీ
నీవు నన్ను విడిచి వెళ్ళే క్షణాన నేను గంభీరకన్నీటి నీలి మేఘాన్ని.
నీ చూపు నన్ను దాటగానే. నీ భావాల చిరుపవనం నన్ను తాకుతుంది.
అ మేఘం అనంత కన్నీటి వర్షపు ధారలను వర్షిస్తుంది. తనను తానూ అదుపు చేసుకోలేనంతగా వర్షిస్తూనే ఉంటుంది.

తిరిగి నిన్ను చేరి ఆర్ధమయ్యే  వరకు వర్షిస్తూనే ఉంటుంది. 

I Miss you So much ,,,,,........

1 comment:

ROLEMODEL said...

superb..........nowords